- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టూడెంట్స్ అలర్ట్.. ఏడాదికి రూ.లక్ష 80వేలకు పైగా స్కాలర్‌షిప్ పొందే అవకాశం, ఇప్పుడే అప్లై చేయండి
పీజీ, యూజీ చదివే విద్యార్థినిలకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అడ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(DRDO) 2022-23 విద్యా సంవత్సరానికి గానూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం స్కాలర్ షిప్ ఖాళీల సంఖ్య: 30
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 31
*ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్, ఎయిరో నాటికల్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్ అండ్ రాకెట్రీ, ఏవియోనిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థినిలు దరఖాస్తు చేసుకోవచ్చు.
*ఇందులో యూజీ స్కాలర్ షిప్ లు 20, పీజీ స్కాలర్ షిప్ లు 10 ఉన్నాయి.
*యూజీ స్కాలర్ షిప్ కి సంబంధించి బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్) కోర్సుల్లో మొదటి సంత్సరం అడ్మిషన్ తీసుకున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వ్యాలిడ్ జేఈఈ మెయిన్ స్కోర్ కూడా ఉండాలి.
*యూజీ స్కాలర్ షిప్ కి ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.1,20,000 అందజేస్తారు.
*పీజీ స్కాలర్ షిప్ కి సంబంధించి ఎంఈ/ఎంటెక్/ఎమ్మెస్సీ (ఇంజనీరింగ్) కోర్సుల్లో మొదటి సంత్సరం అడ్మిషన్ తీసుకున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వ్యాలిడ్ గేట్ స్కోర్ కూడా ఉండాలి.
*పీజీ స్కాలర్ షిప్ కి ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.1,86,600 అందజేస్తారు.
* జేఈఈ మెయిన్/గేట్ స్కోర్ ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.
*దరఖాస్తు కోసం https://rac.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.