ఆర్ట్స్ విద్యార్థులకు అద్భుతమైన కెరీర్ అవకాశాలు..

by Vinod kumar |   ( Updated:2023-04-13 13:56:37.0  )
ఆర్ట్స్ విద్యార్థులకు అద్భుతమైన కెరీర్ అవకాశాలు..
X

దిశ, కెరీర్: హెచ్‌ఈసీ విద్యార్థులు సాధారణంగా డిగ్రీ స్థాయిలో బీఏను ఎంచుకుంటారు. వీరు బీఏ లో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ వంటి బీఏ కోర్సులు చేయవచ్చు. బీఏ పూర్తి చేసుకుని మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సులైన ఎంఏ హిస్టరీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి ఉన్నత చదువులు చదవవచ్చు. ఆర్ట్స్ విద్యార్థులు యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1,2,3,4తో పాటు ఇతర సర్వీసులైన వీఆర్‌వో/వీఆర్‌ఏ వంటి అన్ని పోటీ పరీక్షలు రాయవచ్చు.

హెచ్‌ఈసీ విద్యార్థులు సంప్రదాయ బీఏ కోర్సుకు ప్రత్యామ్నాయంగా బీఏ-ఎల్‌ఎల్‌బీ కూడా చేయవచ్చు. ఇంటర్మీడియట్ అర్హతతో ఐదేళ్ల లా కోర్సులో అడుగు పెట్టొచ్చు. కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా ‘లా’ కోర్సులోని కొత్త సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. లా పూర్తి చేసిన అభ్యర్థులు కేవలం న్యాయవాద వృత్తికే పరిమితం కాకుండా కార్పొరేట్ కొలువులు సొంతం చేసుకోవచ్చు.

సీఈసీ..

సాధారణంగా సీఈసీ విద్యార్థులు డిగ్రీ స్థాయిలో బీకాం కోర్సును ఎంచుకుంటారు. డిగ్రీతోపాటు సీఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులను పూర్తి చేయవచ్చు. చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ.. సీఈసీ విద్యార్థులు ఎంచుకోదగిన ముఖ్యమైన ప్రొఫెషనల్ కోర్సులు. అలాగే టూరిజం అండ్ హాస్పిటాలిటీ కోర్సుల్లో చేరవచ్చు.

ఇంటర్ అర్హతతో రాయదగిన పోటీ పరీక్షలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్, ఇండియా పోస్టల్ డిపార్ట్ మెంట్ నిర్వహించే పరీక్షలైన పోస్టల్ అసిస్టెంట్స్, సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు, పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టులు, పారా మిలిటరీ పోస్టులు , రాష్ట్ర స్థాయిలో అన్ని రకాల గ్రూప్-4 ఉద్యోగాలు పొందవచ్చు. డీఈడీతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌జీటీ ఉద్యోగాలు సాధించవచ్చు.

Also Read...

ఉన్నత చదువులకు ఉత్తమ మార్గం బీఎస్సీ..

Advertisement

Next Story

Most Viewed