- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యాలకుల వల్ల బెనిఫిట్స్
దిశ, వెబ్‌డెస్క్: కొన్ని వంటకాల్లో మసాలాల్లో, టీలో యాలకులను ఉపయోగిస్తుంటాం. సాధారణంగా మన వంటింట్లో ఉంటాయి. యాలకులు భారత్‌తో పాటు భూటాన్, నేపాల్, ఇండొనేషియా దేశాల్లో కూడా దొరుకుతాయి. యాలకులు మంచి సువాసనను కలిగి ఉంటాయి. యాలకుల్లో అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
యాలకుల్లో ఆహారాన్ని జీర్ణం చేసే గుణాలు ఉంటాయి. వీటిలో ఉండే ఔషధ గుణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిక్ రుగ్మతలను పొగొడుతుంది. యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషీయం పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే పొటాషియం గుండె పని తీరును, అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. యాలకుల్లో కావాల్సినంత స్థాయిలో ఎలక్ట్రోలైట్లు కూడా ఉంటాయి.
కొంతమంది బాధలను తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్తుంటారు. మీరు డిప్రెషన్ లో ఉన్నప్పుడు వెంటనే ఉపశమనం కలిగించేందుకు యాలకులు ఎంతోగానూ ఉపయోగపడుతాయి. ఆ సమయంలో వీటిని తింటే మీరు వెంటనే డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు. యాలకులు వేసి మరిగించిన టీ తీసుకోవడం వల్ల వెంటనే ఒత్తిడి తగ్గుతుంది.
ఆస్తమాను అదుపులో ఉంచగలిగే గుణాలు యాలకుల్లో ఉంటాయి. కఫం, దగ్గు, ఊపిరాడకపోవడం, రొమ్ము దగ్గర ఏదో పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలతో బాధపడేవారు యాలకుల్ని రెగ్యులర్‌గా వాడుతుంటే ఎంతో ఉపశమనం కలుగుతుంది. గ్రీన్ యాలకుల్ని ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యల్ని నయం చేయడానికి వాడతారు. యాలకులు డయాబెటిస్‌ను కొంత మేర అదుపులో ఉంచగలవు. వీటిలో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం రాకుండా అడ్డుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఒక యాలక్కాయ తిని గోరువెచ్చని నీళ్ళు త్రాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.