తృటిలో తప్పిన పెను ప్రమాదం

by Shyam |
తృటిలో తప్పిన పెను ప్రమాదం
X

దిశ, రంగారెడ్డి: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ ఫ్లై‌ఓవర్‌పై పిల్లర్ నంబర్ 240 వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement

Next Story