ఆ ఎమ్మెల్యేకు… షాకిచ్చిన టీఆర్ఎస్ కేడర్

by Sridhar Babu |   ( Updated:2020-08-07 03:15:54.0  )
ఆ ఎమ్మెల్యేకు… షాకిచ్చిన టీఆర్ఎస్ కేడర్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్:

సొంత పార్టీ కౌన్సెలర్లు, అధికార పార్టీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించారు. చొప్పదండి మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్యానెల్‌కు చుక్కెదురు అయింది. ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేసిన ఎండీ అజ్జు, అమరకొండ తిరుపతి, అమీనా సుల్తానా, గండి లలితలు కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నిక కావడం విశేషం.

ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రతిపాదించిన గొల్లపల్లి ప్రభావతి, ఇంద్రసేనా రెడ్డి, జహీర్, షబానాలు ఓటమి చవి చూశారు. చొప్పదండి మున్సిపల్ కౌన్సిల్‌లో మొత్తం 14 మంది కౌన్సిలర్లు ఉండగా దండె జమున అనే కౌన్సిలర్ గైర్హాజరయ్యారు. ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే రవిశంకర్ ఓటు వేసిన అభ్యర్థుల్లో అమీనా సుల్తానా మినహా మిగతా ముగ్గురు ఓటమి పాలు కావడం విశేషం. మరో అభ్యర్థి విషయంలో తాను బలపరిచిన సబానాకు ఎమ్మెల్యే సైతం ఓటు వేయలేదు.

మొత్తం నలుగురు కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా ఎమ్మెల్యే రవిశంకర్ సూచించిన నలుగురు సభ్యులను ఎన్నుకునేందుకు నిరాకరించి మెజార్టీ టీఆర్ఎస్ వర్గ కౌన్సిలర్లు, సొంతంగా కో-ఆప్షన్ బరిలోకి అభ్యర్థులను బరిలో దింపి పంతం కౌన్సెలర్లు పంతం నెగ్గించుకున్నారు. ఎమ్మెల్యే ప్యానెల్‌ను ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు సహకరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని టీఆర్ఎస్ పార్లీ కౌన్సెలర్లు సొంతగా అభ్యర్థులను పోటీలో దింపి గెలిపించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed