ఒలింపిక్స్‌ నుంచి వైదొలిగిన కెనడా

by vinod kumar |   ( Updated:2020-03-23 01:03:40.0  )
ఒలింపిక్స్‌ నుంచి వైదొలిగిన కెనడా
X

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కెనడా క్రీడా సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 2020, వేసవిలో జపాన్‌లో జరిగే ఒలింపిక్స్‌, పారా ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదని కెనడియన్ ఒలింపిక్స్ కమిటీ (సీఓసీ), పారాఒలింపిక్స్ కమిటీ(సీపీసీ)లు ప్రకటించాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని అమెరికా, యూకే క్రీడా సంఘాలు ఇప్పటికే కోరాయి. ఇలాంటి తరుణంలో కెనడా ఏకంగా ఒలింపిక్స్‌ను వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 13 వేల మంది మృతిచెందారు.

Tags: sports, tokyo olympics, canada first nation to pull out of tokyo 2020, olympics amid covid-19 pandemic

Advertisement

Next Story