నిర్బంధంతో మమ్మల్ని భయపెట్టలేరు

by Shamantha N |
caa-protesters
X

న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్ల కేసులో బెయిల్ మంజూరైన రెండు రోజుల తర్వాత తిహార్ జైలు నుంచి సీఏఏ నిరసనకారులు, పింజ్రా థోడ్ కార్యకర్తలు గురువారం విడుదలయ్యారు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ జైలు అధికారులు వారిని విడుదల చేయలేదు. దీనిపై హైకోర్టులో మళ్లీ వాదనలు జరగ్గా, బెయిల్ ప్రక్రియ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. ఈ కోర్టు ఆదేశాల తర్వాత యాంటీ సీఏఏ నిరసనకారులు, పింజ్రా థోడ్ కార్యకర్తలు నతాషా నర్వాల్, దేవాంగన కలితలతో పాటు మరో కార్యకర్త ఆసిఫ్ ఇక్బాల్ తాన్హాలు విడుదలయ్యారు.

నిర్బంధంతో తమను భయపెట్టలేరని, జైళ్లపాలు చేస్తే తమ ఆశయం మరింత బలపడుతుందని విడుదల అనంతరం వారు అన్నారు. ‘మేం మహిళలమైనా వారిని చూసి భయపడటం లేదు. కోర్టులో జరిగిన విచారణ ప్రభుత్వ విఫలప్రయత్నాలను వెల్లడిస్తున్నది’ అని కలితా వివరించారు. ‘తాము నమ్మిన నిజాన్ని ఎత్తిపట్టినందుకు ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు. మేం చేసినవన్నీ నిరసనలే. అందులో ఉగ్రవాదం లేదు. అది మహిళా సారథ్యంలో జరిగిన ప్రజాస్వామిక నిరసన మాత్రమే’ అని నతాషా అన్నారు.

Advertisement

Next Story

Most Viewed