- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కెన్ ఫిన్ హోమ్స్ నికర లాభం 15 శాతం వృద్ధి !
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్(Housing Finance) సంస్థ కెన్ ఫిన్ హోమ్స్(Ken Fin Holmes) 2020-21 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 15 శాతం వృద్ధితో రూ.93.15 కోట్లను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికం(Quarterly)లో కంపెనీ నికర లాభం రూ. 80.98 కోట్లుగా నమోదైంది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ నికర ఆదాయం(Net income) రూ.522.50 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 484.14 కోట్లతో పోలిస్తే 8 శాతం వృద్ధిని సాధించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో వెల్లడించింది.
ప్రస్తుత ఏడాది జూన్ 30 నాటికి కంపెనీ సురక్షితమైన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల(Of non-convertible debentures)పై వందశాతం(One hundred percent) ఆస్టి రక్షణ నిర్వహించినట్టు పేర్కొంది. కొవిడ్-19 నేపథ్యంలో ఆర్‌బీఐ మార్గదర్శకాల(RBI guidelines) ప్రకారం..అర్హులైన వారికి కంపెనీ మారటోరియం(Moratorium) అవకాశాన్ని ఇచ్చినట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. అలాగే, జూన్ 30 నాటికి కేటాయింపులు రూ. 72.89 కోట్లుగా ఉన్నట్టు, కొవిడ్-19 నేపథ్యంలో ఆర్‌బీఐ నిబంధనల కంటే ఎక్కువ కేటాయింపులు జరిపినట్టు కంపెనీ వెల్లడించింది. జూన్ 15న జరిగిన బోర్డు సమావేశంలో డైరెక్టర్ల బోర్డు(Board of Directors) ఒక్కో షేర్‌కు రూ. 2 డివిడెండ్(Dividend)ను సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.