ఒకే కారులో టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ ప్రచారం.. ఓటు మాత్రం ఈటలకే..!

by  |   ( Updated:2021-10-22 06:01:49.0  )
ఒకే కారులో టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ ప్రచారం.. ఓటు మాత్రం ఈటలకే..!
X

దిశ, ఓదెల: హుజూరాబాద్ ఉప ఎన్నిక దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల ప్రచారంలో పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలానికి చెందిన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకటే వాహనంలో వెళ్లి ప్రచారం నిర్వహించడం గమనార్హం. మూడు పార్టీల వద్దకు ఒకే కారులో వెళ్లిన కార్యకర్తలు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఇన్‌చార్జీల నుంచి వాహన కిరాయి, మందు, భోజనానికి ఖర్చుల డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. కానీ, ఓటు మాత్రం ఈటల రాజేందర్‌కే వేయాలని చెప్పడంతో అక్కడ ఉన్న ఓటర్లు వీరిని చూసి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed