దివాళా అంచుల్లో కాఫీ డే సంస్థ

by Harish |   ( Updated:2021-04-08 09:21:27.0  )
దివాళా అంచుల్లో కాఫీ డే సంస్థ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని అతిపెద్ద కాఫీ ఉత్పత్తుల విక్రయ సంస్థ కేఫ్ కాఫీ డే దివాళా అంచుల్లో ఉంది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ 2021, మార్చి నాటికి రుణ వాయిదాలను చెల్లించచడంలో విఫలమైంది. బిజినెస్ స్టాండర్డ్స్ ప్రకారం..మార్చి త్రైమాసికంలోపు ఈ సంస్థ రూ. 280 కోట్ల భారీ మొత్తం అప్పులను చెల్లించాల్సి ఉంది. ఈ రుణాలను చెల్లించని కారణంగా అప్పులిచ్చిన బ్యాంకర్లు, ఆర్థిక సంస్థలు కేఫ్ కాఫీ డేపై నేషనల్ కంపెనీ లా ట్రెబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)కి పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. కాఫీ డే సంస్థ తన వెండింగ్ మెషీన్‌లను టాటా గ్రూపునకు విక్రయించడానికి ప్రయత్నించినప్పటికీ కాఫీ డే చైన్ మార్కెట్ విలువపై ఖచ్చితత్వం కుదరక టాటా గ్రూపుతో చర్చలు విఫలమైనట్టు సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.

ఇప్పటికే కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలను పాటించలేదని కాఫీ డే షేర్ల ట్రేడింగ్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలు రద్దు చేశాయి. 1996లో బెంగళూరు కేంద్రంగా కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(సీడీఈఎల్) తన మొదటి కాఫీ ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. అనంతరం 1999 నుంచి దేశీయంగా అత్యధిక గ్రీన్ కాఫీ ఎగుమతి చేసే సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత 2019లో కాఫీ డే సంస్థ వ్యవస్థాపకుడు వీ జీ సిద్ధార్థ అనుకోని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడంతో సంస్థ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటూ వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed