2 కి.మీ.లకు రూ.299 ఛార్జీ

by Aamani |   ( Updated:2021-07-13 10:52:34.0  )
2 కి.మీ.లకు రూ.299 ఛార్జీ
X

దిశ, సిటీ బ్యూరో: మహానగరంలో చినుకు పడిందంటే చాలు క్యాబ్ లకు కాసుల పండగ. సాయంత్రం ఆఫీసు వేళల్లో అకస్మాతుగా వర్షం కురిస్తే, ఎక్కడో పక్కకు కాసేపు ఆగి వెళ్దామనుకుంటాం. కానీ ఎంతకీ వర్షం తగ్గకపోవటం, వెళ్లాల్సిన చోటకు సకాలంలో చేరుకోమేమోనన్న ఆత్రుతతో క్యాబ్ లో వెళితే త్వరగా, సురక్షితంగా వెళ్దామని క్యాబ్ యాప్ ను క్లిక్ చేస్తే రైడ్ ఖరారు కావటానికి గంటల సమయం పడుతోంది. రెండు రోజుల క్రితం వర్షం పడుతున్నపుడు రాత్రి పది గంటల సమయంలో ఓలా క్యాబ్ కేవలం రెండు కిలోమీటర్ల దూరానికి రూ.299 వసూలు చేసింది.

ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీసుకు సమీపం నుంచి మాసాబ్ ట్యాంక్ ఓవైసీపురా షాలిమార్ హోటల్ వరకు వెళ్లేందుకు అంత పెద్ద మొత్తంలో ఛార్జీ వర్తింపజేయటంతో రైడ్ బుక్ చేసుకున్న రైడరే కాదు, క్యాబ్ డ్రైవర్ కూడా అవాక్కయ్యారు. రూ.299 వర్తమాన రైడ్ కు ఛార్జీలుగా వడ్డించగా.. ఇదివరకే బుక్ చేసి రద్దు చేసుకున్న ఓ రైడ్ కు రూ.27ను కలుపుతూ సదరు రైడర్ నుంచి రూ.326 వసూలు చేశారు. వర్షం కురిసినపుడు క్యాబ్ యాప్ నిర్వాహకులు క్యాబ్ లు లేవని, మీరు రైడ్ కోరిన రూట్ లో చాలా డిమాండ్ ఉందని క్యాబ్ లో మెసేజ్ లు పంపుతూ ఇలా ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నట్లు రైడర్లు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story