- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుబ్బాకలో వారి మధ్య వార్..!
దిశ ప్రతినిధి, మెదక్: ఒకప్పుడు రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన పార్టీలు ఇప్పుడు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాడ లేకుండా పోయిన ఆ పార్టీలు, అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కనిపించడం లేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత క్రమంగా మసక బారిపోతున్న ఆ పార్టీల భవిష్యత్తే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం తిరుగులేని శక్తిగా విరాజిల్లింది. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో టీడీపీ తన పట్టు కోల్పోతూ వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. ఇక వామపక్ష పార్టీలు సైతం ఇదే కోవాలోకి వస్తాయి. గతంలో నామమాత్రపు స్థానాలకే పరిమితం అయిన వామపక్షాలు ఇప్పుడు ఎక్కడా కానరాకుండా పోయాయి.
తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల్లో త్రిముఖ పోరే జరిగేలా కనిపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే బైపోల్ వార్ సాగనుంది. తెలంగాణ జన సమితి, వామపక్షాలు ఇప్పటివరకూ ఈ ఎన్నికపై నోరు మెదకపోవడంతో ఆ పార్టీలు ఇక పోటీలో లేనట్టే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే వాటి మద్దతు ఎవరికి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత అనుభవాల దృష్ట్యా టీజేఎస్, కాంగ్రెస్ కు సపోర్ట్ చేయొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇస్తేనే.. దుబ్బాకలో కాంగ్రెస్ కు కోదండరాం అండ్ కో సహకరించే విధంగా షరతు పెట్టొచ్చన్న అంచనాలు ఉన్నాయి. కానీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా పోటీలో నిలబడే అవకాశాలు ఉన్నాయి.
దీంతో దుబ్బాకలో టీజేఎస్ ఎవరికీ మద్దతిచ్చే పరిస్థితులు కనబడటం లేదు. ఇక సీపీఐ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఎవరికి మద్దతిచ్చే విషయాన్ని మాత్రం దాటవేసింది. ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించే లౌకిక పార్టీకి మద్దతు ఇస్తామంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చాడ హింట్ ఇచ్చి వదిలేశారు. అయితే ఆ లౌకికపార్టీ టీఆర్ఎస్ నా, కాంగ్రెస్ నా అనే విషయాన్ని చెప్పలేదు. మరో పార్టీ సీపీఎం ఇంతవరకు ఈ ఉప ఎన్నికలపై స్పందించలేదు. కేవలం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మాత్రమే దుబ్బాక ఉప పోరులో తమ అభ్యర్థి విషయంలో క్లారిటీ ఇవ్వగా.. మిగతా పార్టీలు మాత్రం మీన మేషాలు లెక్కబెడుతున్నాయి. చివరి క్షణాల్లో అయినా ఆ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తాయో? లేదో? చూడాలి.