- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరాశలో ఆడపడుచులు.. బతుకమ్మ చీరల పంపిణీ లేనట్టేనా..?
దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ మహిళలకు ఈసారి బతుకమ్మ చీరలు ల్లేవ్. ఉప ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికల కోడ్ నేపథ్యంలో పంపిణీని నిలిపివేశారు. అదే విధంగా కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో సైతం బతుకమ్మ పండుగకు చీరలు అందజేయడం లేదు. పంపిణీ చేస్తే మహిళలను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నిలిపివేసింది. ఈ రెండు జిల్లాలు మినహా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు చేపట్టారు.
ప్రతి ఆడబిడ్డ సంతోషంగా జరుపుకునే పండుగ ‘బతుకమ్మ’. దశాబ్దాలుగా సరిపడా ఉపాధి లేని నేతన్నలకు చేతినిండా పని కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీని 2017 నుంచి చేపట్టింది. సర్కారు ప్రతిష్టాత్మకంగా, ప్రణాళికాబద్దంగా పంపిణీ చేస్తుంది. 18 ఏళ్లు నిండి, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు చీరలు అందజేస్తుంది. ప్రతి ఏటా రూ. 300 కోట్లకు పైగా చీరల పంపిణీ కేటాయిస్తుంది. ఈ ఏడాది అర్హులు సంఖ్య పెరగడంతో సుమారు కోటి 8 లక్షల చీరలను సిద్ధం చేసింది. ఇందుకోసం రూ.333.14 కోట్లను మంజూరు చేసింది. తయారైన చీరలను అధికారులు జిల్లా కేంద్రాలకు తరలించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి మహిళలకు అందజేయనున్నారు.
అక్టోబర్ 6 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో అధికారులు అక్టోబర్ 2 నుంచి చీరలపంపిణీకి అన్ని చర్యలు చేపట్టారు. మెప్మా, సెర్ప్ కింద స్వయం సహాయక బృందాల మహిళా ప్రతినిధులు నుంచి అభిప్రాయాలు, సలహా సంప్రదింపుల ఆధారంగా నిఫ్ట్ డిజైనర్లతో సరైన డిజైన్ పాటర్న్, ప్రామాణికాలతో ఈ ఏడాది బతుకమ్మ చీరలను నూతనంగా డాబీ, జాకార్డ్లు డిజైనులతో నాణ్యమైన క్వాలిటీతో తయారు చేయించారు. టెస్కో ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ శాఖ, రెవెన్యూ అధికారులు చీరల తయారీని పర్యవేక్షణ చేశారు.
ఈ ఏడాది 30 సరికొత్త డిజైన్లను రూపొందించి వాటిని 20 విభిన్న రంగులతో అన్వయించి విస్తృత శ్రేణిలో మొత్తం 810 రకాల చీరలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ చీరలన్నీ జరి అంచులతో 100శాతం పాలిస్టర్ ఫిలిమెంట్, నూలుతో తయారు చేశారు. వస్త్రాల నాణ్యత, తయారీ, ప్రింటింగ్, కొంగు,బార్డర్లు, ప్యాకేజీంగ్ వంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అర్హత కల్గిన మహిళలందరికీ పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 6.30 మీటర్ల పొడవుగల కోటి సాధారణ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయోవృద్ధ మహిళల కోసం 9.00 మీటర్లు పొడవు గల చీరలు 8 లక్షలు తయారు చేయించారు.
2017లో 95, 48,439 మహిళలకు, 2018లో 96,70,474 మందికి, 2019లో 96,57,813 మహిళలకు, 2020లో 96,24,384 చీరలను పంపిణీ చేయగా, ఈ ఏడాది (2021)లో కోటి 8 లక్షల చీరలను పంపిణీ చేయనున్నారు. ఇదిలా ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతోనే కాకుండా కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లోని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం లేదు. దీంతో ఈ సారి ఆ జిల్లాల మహిళలకు నిరాశే. ఎన్నికల అనంతరం చీరలు పంపిణీ చేయనున్నారు. ఈ రెండు జిల్లాలు తప్పా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో బతుకమ్మ చీరలను క్షేత్రస్థాయిలో చీరల పంపిణీ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించగా, గ్రామ కార్యదర్శులు, బిల్లు కలెక్టర్లు, రేషన్‌షాప్ డీలర్లు, సెర్ప్, మెప్మా మహిళా స్వయం సహాయక సంఘాల సహకారంతో లబ్ధిదారులకు అందజేస్తారు.
810 రకాలతో చీరలను తయారు చేయించాం
ఈ ఏడాది 30 సరికొత్త డిజైన్లు 20 విభిన్న రంగులతో అన్వయించి విస్తృత శ్రేణిలో మొత్తం 600ల నుంచి 800 రకాల చీరలను టెస్కో ఆధ్వర్యంలో తయారు చేయించామని, ఇప్పటికే 90శాతానికి పైగా జిల్లా కేంద్రాలకు సరఫరా చేశామని టెస్కో ఎండీ శైలజారామయ్యార్ వెల్లడించారు. గురువారం ప్రకటన విడుదల చేసిన ఆమె.. ప్రభుత్వం 2017 నుంచి తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ చేస్తుందని, అందులో భాగంగా ఈ ఏడాది కోటి 8 లక్షల చీరలను తయారు చేయించామన్నారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలను నివారించేందుకు సిరిసిల్ల పవర్ లూమ్ క్లస్టర్‌లో 16 వేల మందితో, 20వేల పవర్ లూమ్స్‌తో చీరలను తయారు చేయిస్తున్నట్లు తెలిపారు.
సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ జిల్లాలోని 373 మాక్స్ సంఘాలు, ఎస్ఎస్ఐ యూనిట్లలో10 వేల నుంచి 16వేల పవర్ లూమ్స్ లో చీరలు తయారు చేయించినట్లు వెల్లడించారు. ప్రతి నెలా రూ.16 వేల నుంచి రూ.20వేలు సమకూరుతుందని తెలిపారు. నేత కార్మికుల నైపుణ్యాన్ని పెంచడంతో పాటు నూతన డిజైన్లు, ఉత్పత్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అక్టోబర్ 2 నుంచి గ్రామాల్లోని వార్డు స్థాయిల్లో ప్రభుత్వ అధికారులతో పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉంటుందని వెల్లడించారు.
ఆ రెండు జిల్లాల్లో పంపిణీ చేయం
ఉప ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్ తో పాటు కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో చీరల పంపిణీ చేయడం లేదు. మిగిలిన 31 జిల్లాల్లో పంపిణీ చేస్తాం. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశాం. ఎన్నికలు పూర్తి కాగానే హుజూరాబాద్ తో పాటు కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో చీరల పంపిణీ చేస్తాం.
-యాదగిరి, టెస్కో జనరల్ మేనేజర్