- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూట్యూబ్‌లో ‘బుట్టబొమ్మ’ ట్రెండ్
‘అల వైకుంఠపురంలో..’ సంక్రాంతికి అలా వచ్చి.. ఇలా తెలుగు ఇండస్ట్రీ నాన్ బాహుబలి రికార్డులను బద్ధలు కొట్టిన సినిమా. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషనలో వచ్చిన ఈ సినిమాకు మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. బన్నీ సినిమాలకు మామూలుగానే సంగీతం అదిరిపోతుంది..ఇక అల వైకుంఠపురంలో ఆల్బమ్ అయితే దుమ్ముదులిపేసిందనే చెప్పాలి. ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ డైరెక్షన్‌లో వచ్చిన సామజవరగమన, రాములో రాముల లిరికల్ సాంగ్స్‌కు ప్రేక్షకులు ఫిదా కాగా .. మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న తొలి పాటగా సామజవరగమన రికార్డ్ సృష్టించింది. రాములో రాముల సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. అంతేకాదు ఈ ఆల్బమ్‌లోని ‘బుట్ట బొమ్మ సాంగ్’ టిక్ టాక్‌లో తెగ వైరల్ అయింది. ఈ ఐదారేళ్లలో అత్యంత ప్రజాదారణ పొందిన సాంగ్ బుట్టబొమ్మే కావడం విశేషం.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ సెలబ్రిటీస్ వరకు..అమీర్ పేట్ నుంచి ఆగ్రా స్టూడెంట్స్ వరకు..గల్లీ నుంచి ఢిల్లీలో ఉన్న జనాల వరకు … ప్రతీ ఒక్కరు బుట్ట బొమ్మపై స్టెప్పులు వేశారంటే అతిశయోక్తి కాదు. టిక్ టాక్‌తో ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అయిన ఈ పాట వీడియో సాంగ్‌ను అల వైకుంఠపురంలో టీమ్ ఇటీవలే విడుదల చేసింది. కాగా విడుదలైన క్షణాల్లోనే యూ ట్యూబ్‌లో మళ్లీ ట్రెండ్ అవుతూ రికార్డు దిశగా దూసుకుపోతోంది.