Investments: మ్యుచవల్‌ ఫండ్స్‌ రాణులు.. మగాళ్ల కంటే మహిళలే టాప్.. ఈ లెక్కలే సాక్ష్యం!

by Vennela |
Investments: మ్యుచవల్‌ ఫండ్స్‌ రాణులు.. మగాళ్ల కంటే మహిళలే టాప్.. ఈ లెక్కలే సాక్ష్యం!
X

దిశ, వెబ్‌డెస్క్: Mutual Funds: సాధారణంగా భారతీయ మహిళలకు పొదుపు అలవాటు(Saving habit) ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న చిన్న మొత్తాల్లో దాచుకుంటారు. దీర్ఘకాలంలో పెద్దమొత్తం చేయాలనుకుంటారు. అందుకు తగిన మార్గాల్లో ఇన్వెస్ట్(Investments) చేస్తుంటారు. ఆ డబ్బులతో పిల్లల చదువులు, పెళ్లిళ్లు, బంగారం కొనుగోళ్లు వంటి అవసరాలకు ఉపయోగిస్తుంటారు. అయితే మహిళల పొదుపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. పొదుపును వీడి రిస్క్ ఉన్నప్పటికీ పెట్టుబడులు(Investments) పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) ద్వారా స్టాక్ మార్కెట్లో(stock market) పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మేరకు ఫోన్ పే వెల్త్ రిపోర్ట్(PhonePe Wealth Report) కీలక వివరాలను వెల్లడించింది. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) వైపు మొగ్గు చూపిస్తున్నారని పేర్కొంది.

సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్(Systematic Investment Plan) పద్దతిలో దీర్ఘకాలం పాటు మ్యూచువల్ ఫండ్స్ లో 90శాతం మంది మహిళలు ఇన్వెస్ట్(Investments) చేస్తున్నారు. సగటున నెలకు రూ. 1300 సిప్ వాయిదాలో చెల్లిస్తున్నారు. ఇది మగాళ్ల పెట్టుబడి సగటు కంటే ఎక్కువ. ఒకేసారి లంప్ సమ్ పెట్టుబడు(Lump sum investment)ల్లోనూ మహిళలదే పై చేయిగా ఫోన్ పే వెల్త్(PhonePe Wealth Report) రిపోర్టు వెల్లడించింది. మహారాష్ట్ర, కర్నాటక, యూపీ రాష్ట్రాలకు చెందిన మహిళలు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడంలో ముందజలో ఉన్నట్లు నివేదిక తెలిపింది.

మ్యూచువల్ ఫండ్స్లో (Mutual Funds) ఇన్వెస్ట్(Investments) చేసే మహిళల్లో 74శాతం మంది 35ఏళ్ల వయసులోపే వారు ఉన్నారు. అందులో 29శాతం మంది మహిళలు 26 నుంచి 30ఏళ్ల వయసు లోపు వారే ఉన్నట్లు రిపోర్టు తెలిపింది. అలాగే వారిలో చాలా మంది సిప్ పెట్టుబడుల ద్వారానే మ్యూచువల్ ఫండ్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 90శాతం మంది ఇదే పద్దతిని ఎంచుకుంటున్నారు. మెట్రో నగరాలకు చెందిన మహిళల్లో కాకుండా ద్వితీయ, త్రుతీయ శ్రేణి నగరాల్లో మహిళలు మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds)ఎంచుకుంటున్నారు. వారణాసి, రాంచి, గుహవాటి, వడోదరా, డెహ్రాడూన్, వంటి నగరాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కాంట్రా, వాల్యూ ఫండ్స్ లో మహిళలు అధికంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్ థీమ్యాటిక్ ఫండ్స్(Mid-cap thematic funds) లోనూ మహిళలు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొంది.


Next Story

Most Viewed