అడ్డు తెరలను చీల్చుకుంటున్న మహిళలు

by Harish |   ( Updated:2023-07-15 16:57:28.0  )
అడ్డు తెరలను చీల్చుకుంటున్న మహిళలు
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ కంపెనీలలో మహిళల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతుంది. 2021తో పోల్చితే 2022 నాటికి 17 శాతం పెరగుదల నమోదైందని DivHERsity బెంచ్‌మార్కింగ్ రిపోర్ట్ పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం, భారత కార్పొరేట్ కంపెనీలలో మహిళల ప్రాతినిధ్యం 2021లో 33 శాతం ఉండగా, 2022 నాటికి అది 50 శాతానికి చేరింది. కానీ స్టార్టప్‌లు, చిన్న కంపెనీలలో మాత్రం 12 శాతం క్షీణత నమోదైంది, ఇది 2021లో 39 శాతం ఉండగా, 2022 నాటికి 27 శాతానికి చేరింది.

2022-23(జనవరి) మధ్య దేశవ్యాప్తంగా 300 కంపెనీలలో చేసిన సర్వే ఆధారంగా ఈ నివేదిక వెలువడింది. ప్రస్తుతం 70 శాతం కంపెనీలు స్పష్టమైన లింగ వైవిధ్య లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి. 89 శాతం కంపెనీలు తమ సంస్థలలో మహిళల నియామకాలను క్రమంగా పెంచుతున్నాయని నివేదిక పేర్కొంది. దాదాపు చాలా కంపెనీలు మహిళలను ప్రోత్సహించడానికి ప్రత్యేక సదుపాయాలను, వివిధ ప్రోగ్రామ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి.

స్టార్టప్‌లలో, చిన్న కంపెనీలలో మాత్రం మహిళల ప్రాతినిధ్యం ఇంకా తక్కువ స్థాయిలోనే ఉంది. ఈ కంపెనీలలో కేవలం 41% మంది మహిళలు మాత్రమే సీనియర్ స్థాయిలో నియమితులయ్యారు. వీటిలో మహిళలు ఎక్కువగా ఎంట్రీ-లెవల్, మిడ్-మేనేజ్‌మెంట్ ఉద్యోగాల కోసం నియమించబడ్డారు.

కరోనా సమయంలో వర్క్-ఫ్రమ్-హోమ్ కారణంగా మహిళలు ఇంటి నుంచి పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపి ఎక్కువగా ఉద్యోగాల్లో చేరారు. 2019 లో కొత్తగా ఉద్యోగంలో చేరే మహిళలు 59 శాతం ఉండగా, ఇది 2020లో 85 శాతం, 2021లో 83 శాతానికి చేరింది, ఆ తర్వాత వర్క్-ఫ్రమ్-హోమ్ తగ్గడం వలన 2022లో 63 శాతానికి తగ్గింది.

Advertisement

Next Story