PM Kisan: రైతులకు అలెర్ట్.. పీఎం కిసాన్‌ 19వ విడత గురించి కీలక అప్‌డేట్‌.. తప్పక తెలుసుకోండి!

by Vennela |
PM Kisan: రైతులకు అలెర్ట్.. పీఎం కిసాన్‌ 19వ విడత గురించి కీలక అప్‌డేట్‌.. తప్పక తెలుసుకోండి!
X

దిశ, వెబ్ డెస్క్: PM Kisan: కేంద్రంలోని మోదీసర్కార్ రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అందులో పీఎం కిసాన్(PM Kisan) స్కీమ్ కూడా ఒకటి. ప్రతి ఏడాది రైతులకు రూ. 6000 చొప్పున అందిస్తోంది. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ డబ్బును అందిస్తోంది. విడతకు రూ. 2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది ప్రభుత్వం.

కేంద్రంలోని మోదీ(PM MODI) ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేస్తోంది. రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు అనేక స్కీములను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ ఆర్థిక సహాయం అందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్(PM Kisan) నిధి యోజనను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ స్కీము ద్వారా అర్హులైన రైతులందరికీ ఏడాదికి మూడు సార్లు రూ. 2000 నగదు సహాయం అందిస్తోంది. మీరు ఈ స్కీములో చేరాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఈ స్కీం కింద అందించే 19 విడతకు అర్హులా కాదా అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో 18 వ విడత వరకు డబ్బులు జమ అయ్యాయి. ఇప్పుడు 19వ విడత డబ్బులు జమ కావాల్సి ఉంది. 19వ విడత(19th installment) డబ్బులు మీ అకౌంట్లో జమ కావాలంటే కావాల్సిన అర్హత ప్రమాణాల గురించి తెలుసుకుందాం.

మీరు పీఎం కిసాన్ యోజన(PM Kisan Yojana)లో నమోదు చేసుకున్నట్లయితే తప్పనిసరిగా కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుంది.

ఈ కేవైసీ: స్కీములో నమోదు చేసుకున్న తర్వాత ఈకేవైసీ(e-KYC)ని పూర్తి చేయడం తప్పనిసరి. ఇలా చేయడంలో విఫలమైన రైతులు ఇన్ స్టాల్ మెంట్ అందడంలో జాప్యం జరిగే ఛాన్స్ ఉంది. మీరు ప్రభుత్వ వెబ్ సైట్ pmkisan.gov.in ద్వారా ఆన్ లైన్ లో ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు. లేదంటే మీ సమీపంలోని సీఎస్సీ కేంద్రానికి వెళ్లి పూర్తి చేసుకోవచ్చు. కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు అయినా..ఇది వరకే పీఎం కిసాన్ సాయం పొందుతున్న రైతులు అయినా తప్పనిసరిగా ఈకేవైసీ నమోదు చేసుకోవాలి.

భూమి ధృవీకరణ: రైతులు తమ భూమి(Land verification) సమాచారం అప్ డేట్ చేయాలి. మీరు ఈ దశను పూర్తి చేయకుంటే వచ్చే నిధుల్లో జాప్యం జరుగుతుంది. భూమికి సంబంధించిన అన్ని వివరాలను పూర్తి చేయాలి.

ఆధార్ లింకింగ్ : మీ ఆధార్ కార్డు(Aadhar card)ను మీ బ్యాంక్ అకౌంట్లో లింక్ చేయడం కూడా తప్పనిసరి. ఇన్ స్టాల్ మెంట్ అర్హతను నిర్ధారించుకునేందుకు మీ బ్యాంక్ బ్రాంచ్ ను సందర్శించి..లింక్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ చెల్లింపుదారులు, వృత్తి నిపుణుల వంటి వారికి పీఎం కిసాన్(PM Kisan) సాయం అందదని గుర్తుంచుకోవాలి. అనర్హులైన వారి పేర్లను కేంద్ర ప్రభుత్వం తొలగిస్తుంది. కుటుంబంలో ఒకరికి మాత్రం పీఎం కిసాన్ బెనిఫిట్ లభిస్తుంది.

Next Story

Most Viewed