ఉచితంగా 5GB డేటా..

by Harish |   ( Updated:2023-05-06 15:37:00.0  )
ఉచితంగా 5GB డేటా..
X

న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా భారీగా యూజర్లను కొల్పోతున్న వేళ వారిని ఎలాగైనా ఆకట్టుకోవాలని కొత్తగా ఒక ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ అమౌంట్‌‌తో రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు ఉచితంగా 5 జీబీ డేటాను అందించనుంది. దీని పేరు మహా రీచార్జ్ స్కీమ్. వీఐ యాప్ నుంచి రీచార్జ్ చేసుకునే వారు ఈ ఆఫర్ పొందవచ్చు. రూ. 199 నుంచి రూ. 299 మధ్య ప్లాన్లపై రీచార్జ్ చేసుకున్న వారికి ఉచితంగా 2 జీబీ డేటా, రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకుంటే మూడు రోజుల వ్యాలిడిటీతో 5 జీబీ డేటాను కంపెనీ ఉచితంగా అందిస్తుంది.

ఇవి కూడా చదవండి :

$800 మిలియన్ల రుణాలను తిరిగి చెల్లించిన వేదాంత

Advertisement

Next Story