ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన పేటీఎం బాస్

by S Gopi |
ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన పేటీఎం బాస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్‌బీఐ ఆంక్షలతో సతమతమవుతున్న డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(పీపీబీఎల్)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కంపెనీ తన బోర్డును పునర్నిర్మించింది. పార్ట్‌టైమ్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా విజయ్ శేఖర్ శర్మ వైదొలగినట్టు పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ సోమవారం ప్రకటనలో వెల్లడించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేబేంద్రనాథ్ సారంగి, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గార్గ్, రిటైర్డ్ ఐఏఎస్ రజనీ సెఖ్రీ సిబల్ స్వతంత్ర డైరెక్టర్లుగా బోర్డులో చేరారు. బోర్డు పునర్నిర్మాణంలో భాగంగానే విజయ్ శేఖర్ శర్మ పేటీం నుంచి వైదొలిగారు. త్వరలో కొత్త ఛైర్మన్‌ను నియమించే ప్రక్రియను ప్రారంభిస్తామని కంపెనీ ఎక్స్ఛేంజి ఫైలింగ్‌లో వెల్లడించింది.

Advertisement

Next Story