యూపీఐ టాక్స్ పేమెంట్స్ పై ఆర్బీఐ సంచలన నిర్ణయం

by M.Rajitha |
యూపీఐ టాక్స్ పేమెంట్స్ పై ఆర్బీఐ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : యూపీఐ టాక్స్ పేమెంట్స్ పై ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ టాక్స్ లిమిట్ 5 లక్షలకు పెంచింది. ఇప్పటిదాకా యూపీఐ టాక్స్ పేమెంట్స్ లిమిట్ రూ.1 లక్ష వరకు మాత్రమే ఉండేది. ఇపుడు దీన్ని ఒకేసారి ఒక్కో ట్రాన్సాక్షన్ రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. తాజా నిర్ణయంతో పెద్ద మొత్తంలో టాక్స్ చెల్లించేవారు ఏ ఇబ్బంది లేకుండా రూ.5 లక్షల వరకు యూపీఐ టాక్స్ పేమెంట్స్ తోనే బిల్లులు చెల్లించుకోవచ్చు. అదనపు ఛార్జీలు ఏమీ ఉండవు. కానీ, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ వాడినపుడు మాత్రం ఛార్జీలు వర్తిస్తాయని సూచించింది. గతంలో కేవలం హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ వంటి వాటికి చేసే యూపీఐ పేమెంట్స్ రూ.5 లక్షల వరకు ఉండగా, ఇపుడు అన్ని రకాల పేమెంట్స్ టాక్స్ పేమెంట్స్ లిమిట్ పెంచింది. అయితే ఇది యూపీఐ టాక్స్ పేమెంట్స్ కు మాత్రమే వర్తిస్తుందని, సాధారణ యూపీఐ పేమెంట్స్ లిమిట్ మాత్రం రూ.1 లక్షగానే ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది.

Next Story

Most Viewed