గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌ పే యూజర్లకు గుడ్ న్యూస్.. NPCI కీలక ప్రకటన

by Mahesh |   ( Updated:2023-04-01 14:47:19.0  )
గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌ పే యూజర్లకు గుడ్ న్యూస్.. NPCI కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: యూపీఐ ఆధారంగా పనిచేసే గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా రూ.2000కు మించి చేసే మర్చంట్ లావాదేవీలపై సర్​ఛార్జ్ చెల్లించాలన్న వార్తలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూపీఐ వినియోగదారులు అందరికి ఈ చార్జీలు వర్తిస్తాయని ఆందోళన చెందగా, అలాంటిదేమీ లేదని భారత జాతీయ చెల్లింపుల సంస్థ(ఎన్‌పీసీఐ) బుధవారం స్పష్టం చేసింది. ప్రీపెయిడ్ పేమెంట్స్​ఇన్​స్ట్రుమెంట్స్ ద్వారా చేసే మర్చంట్ ట్రాన్సాక్షన్స్‌కు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. సాధారణ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం ఉండదని తేల్చిచెప్పింది.

అంతకుముందు యూనిఫైడ్ పేమెంట్స్​ఇంటర్​ఫేస్-యూపీఐ ద్వారా చేసే మర్చంట్ లావాదేవీలపై ప్రీపెయిడ్ పేమెంట్స్​ఇన్​స్ట్రుమెంట్స్- పీపీఐ​ఫీజు వసూలు చేయనున్నట్లు ఎన్​పీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. యూపీఐ ద్వారా రూ.2000 కన్నా ఎక్కువ ట్రాన్సక్షన్లు చేస్తే లావాదేవి విలువలో 1.1 శాతం పన్ను విధించనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 30 నాటికి ఈ ఛార్జీపై సమీక్షిస్తామని చెప్పింది. ట్రాన్సాక్షన్​ఆమోదించడం, ప్రాసెస్ చేయడం, పూర్తి చేయడానికి సంబంధించిన ఖర్చుల దృష్ట్యా ఈ సర్​ఛార్జ్ విధిస్తున్నట్లు జాతీయ చెల్లింపుల సంస్థ- ఎన్​పీసీఐ స్పష్టం చేసింది. కొత్త నిబంధనలు ఏప్రిల్ 1న అమల్లోకి వస్తాయని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed