ఆధార్‌లో అడ్రస్ అప్‌డేట్ ప్రక్రియను సులభతరం చేసిన యూఐడీఏఐ..!

by Hajipasha |   ( Updated:2023-01-17 06:15:49.0  )
ఆధార్‌లో అడ్రస్ అప్‌డేట్ ప్రక్రియను సులభతరం చేసిన యూఐడీఏఐ..!
X

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో ఆధార్‌ కార్డులోని అడ్రస్‌ను అప్‌డేట్ చేయాలనుకునే వారి కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఆధార్‌లో అడ్రస్‌ను అప్‌డేట్ చేయాలని భావించే వారు తమ పేరున ఉండే ధృవీకరణ పత్రం ఇవ్వాలి. అది లేకపోతే అప్‌డేట్ చేసేందుకు వీలు కాదు. అయితే, యూఐడీఏఐ దీన్ని మరింత సులభతరం చేస్తూ ఆధార్‌లో అడ్రస్ మార్చుకొవడానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తి తమ కుటుంబ పెద్ద పేరుతో ఉండే ధృవీకరణ అంటే పాస్‌పోర్ట్, రేషన్ కార్డు, మార్క్ షీట్, వివాహ ధృవీకరణ వంటి వాటిని కూడా ఇవ్వొచ్చని ప్రకటించింది.

ఒకవేళ అడ్రస్ అప్‌డేట్ కోసం ఇచ్చిన డాక్యుమెంట్లు సరైనవి కాకపోతే యూఐడీఏఐ సూచించిన విధంగా కుటుంబంలోని పెద్ద నుంచి స్వీయ ధృవీకరణను ఇవ్వాల్సి ఉంటుంది. అందులో దరఖాస్తుదారు, కుటుంబ పెద్ద పేర్లు, అలాగే వారి సంబంధం తెలిపే సూచన ఉండాలి. ఈ ప్రక్రియలో కుటుంబ పెద్ద ఆధార్‌కు అనుసంధానం చేసిన ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. సంబంధిత కుటుంబ పెద్ద దాన్ని ధృవీకరించాలి. అప్పుడు ఆధార్‌లో అడ్రస్ అప్‌డేట్ అవుతుంది.

Read Also: Aadhaar Card సేవల కోసం Toll-Free నంబర్‌ను తీసుకొచ్చిన UIDAI

Advertisement

Next Story

Most Viewed