Unknown Facts : బంగారం గురించి మీకు తెలియని విషయాలు !

by Prasanna |   ( Updated:2022-12-06 09:30:26.0  )
Unknown Facts :  బంగారం గురించి మీకు తెలియని విషయాలు !
X

దిశ, వెబ్ డెస్క్ : బంగారం పసుపు రంగులో దగ దగా మెరిసే ఈ మూలకం సంపదకు నిదర్శనం. ప్రపంచంలో ఏ దేశంలో నైనా దీనికి ఒక రేంజులో డిమాండ్ ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల నుండి విలువ ఏ మాత్రం తగ్గడం లేదు కదా.. అంతకంత పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా భారతీయులకు బంగారం అనేది ఒక ఎమోషన్ ఎంతోకొంత బంగారం కొనుక్కోవాలని మన దేశంలో ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. అసలు బంగారమంటే ఏంటి ? ఇది ఎలా తయారవుతుంది ? ఈ బంగారమంతా ఎక్కడి నుంచి వస్తుంది. ఎందుకు దాని కంత విలువ వచ్చింది. నకిలీ బంగారాన్ని ఎలా కనుగొనాలి. ఈ భూమి మీద ఎంత బంగారం మిగిలి ఉంది.. ఇలాంటి విషయాలు బంగారం గురించి తెలుసుకుందాం. మనకి వస్తున్న బంగారంలో సుమారు 75% గోల్డ్ మైనింగ్ ద్వారా వస్తుంది. ఒక వేళ మీరు బంగారం కొనాలనుకుంటే జాగ్రత్తగా చూసి కొనండి. ఎందుకంటే బంగారం తుప్పు పట్టదు..మన భూమి మీద ఎంత బంగారం ఉందంటే..వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం ఒక లక్ష తొంభై వేల టన్నులు బంగారం మైనింగ్ ద్వారా తీయడం జరిగింది..ఇంకా 57,000 టన్నుల బంగారం మాత్రమే ఉంది.

Advertisement

Next Story