- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తగ్గిన నిరుద్యోగ రేటు!
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని పట్టణ ప్రాంత నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గింది. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో పట్టణ నిరుద్యోగం 6.8 శాతానికి తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నిరుద్యోగం 8.2 శాతంగా నమోదైంది. 2022లో కరోనా మహమ్మారి పరిస్థితులు ఇంకా కొనసాగినందున నిరుద్యోగం అధికంగా ఉండేది. ఆ తర్వాత త్రైమాసికాల్లో తగ్గుముఖం పడుతూ వచ్చింది.
సమీక్షించిన త్రైమాసికంలో ఆశించిన దానికంటే మెరుగైన ఆర్థిక కార్యకలాపాలతో పాటు సేవల రంగంలో వృద్ధి బాగుండటంతో నిరుద్యోగం తగ్గింది. 2021, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కరోనా వల్ల పట్టణ నిరుద్యోగం 12.6 శాతానికి చేరిన తర్వాత ప్రస్తుతం దాదాపు సగానికి తగ్గడం గమనార్హం. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ తాజా గణాంకాల ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో మహిళల నిరుద్యోగం 10.1 శాతం నుంచి 9.2 శాతానికి తగ్గింది. పురుషుల నిరుద్యోగం 7.7 శాతం నుంచి 6 శాతానికి దిగొచ్చింది.
Also Read..
ఒత్తిడిలో ఉన్న రుణాల విషయంలో అప్రమత్తత అవసరం: ఆర్‌బీఐ గవర్నర్!