Elon Musk: ర్యాప్ సాంగ్ కు ట్రంప్, మస్క్ డ్యాన్స్.. ఏఐ వీడియో వైరల్

by Ramesh Goud |   ( Updated:2024-08-15 15:39:12.0  )
Elon Musk: ర్యాప్ సాంగ్ కు ట్రంప్, మస్క్ డ్యాన్స్.. ఏఐ వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ర్యాప్ సాంగ్ కి నడిరోడ్డుపై ట్రంప్, ఎలాన్ మస్క్ బ్రేక్ డ్యాన్స్ చేశారు. ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుత రోజుల్లో పెరిగిన టెక్నాలజీతో అసాధ్యం అనుకున్నవి కూడా సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్, ప్రముఖ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఇద్దరు నడిరోడ్డుపై అదిరే స్టెప్పులేశారు. ప్రముఖ పాప్ మ్యూజిక్ బ్యాండ్ 'బీ గీస్' బృందం చేసిన ర్యాప్ సాంగ్ "స్టేఇన్ అలైవ్" పాటకు డ్యాన్స్ చేసి నెటిజన్ల మనసు దోచుకున్నారు. అదేలా సాధ్యం అనుకుంటున్నారా? ఏఐతో ఏదైనా సాధ్యమే.. వీరిద్దరు డ్యాన్స్ చేసినట్టుగా రూపోందించిన ఏఐ వీడియోను ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

దీనిపై మమ్మల్ని ద్వేషించేవారు దీన్ని ఏఐకి ఆపాదిస్తారు అని ఫన్నీగా రాసుకొచ్చారు. దీంతో దీనికి సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఇటీవలే మస్క్, ట్రంప్ ను ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. దీనికి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ ఏఐ వీడియోను మస్క్ షేర్ చేయడంతో ప్రచారస్త్రంలో భాగంగానే పోస్ట్ చేశారా అని చర్చ జరుగుతోంది. ఇక దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది నిజమేనా? ఇదేలా సాధ్యం అవుతుందని ఆశ్చర్యపోతున్నారు. ఒక వేళ వీరు నిజంగా ప్రయత్నించినా అది నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే సాధ్యమవుతుందని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed