Tayota Camry: రూ. 48 లక్షల ధరతో భారత మార్కెట్లో కొత్త కారు లాంచ్ చేసిన టయోటా..!

by Maddikunta Saikiran |
Tayota Camry: రూ. 48 లక్షల ధరతో భారత మార్కెట్లో  కొత్త కారు లాంచ్ చేసిన టయోటా..!
X

దిశ, వెబ్‌డెస్క్: జపాన్(Japan)కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా(Tayota) ఎప్పటికప్పుడు కొత్త మోడల్ కార్లను భారత మార్కెట్(Indian Market)లో రిలీజ్ చేస్తూ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే అనేక మోడళ్లను విడుదల చేసిన ఆ సంస్థ తాజాగా నైన్త్ జనరేషన్(Ninth Generation) కామ్రీ(Camry) కారును దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధరను రూ. 48 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. పాత కామ్రీ మోడల్ కారు ధరతో పోలిస్తే దీని ధర రూ. 1.8 లక్షలు ఎక్కువగా ఉంది. లేటెస్ట్ టెక్నాలజీ, ఆకర్షణీయమైన డిజైన్ తో దీన్ని తీసుకొచ్చింది. కామ్రీ కారు డెలివరీలు(Deliverys) వెంటనే స్టార్ట్ కానున్నాయని టయోటా ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఈ కొత్త కామ్రీ కారును 2.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్ తో తీసుకొచ్చారు. ఇది 3200rpm వద్ద 221nm టార్క్(Torque)ను ప్రొడ్యూజ్ చేస్తుంది. మైలేజి పరంగా చూస్తే.. ఈ కారు లీటర్ కు గరిష్టంగా 25.4 కిలోమీటర్ల ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక కారు లోపల 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే 9 స్పీకర్ల జీబీఎల్ సౌండ్ సిస్టమ్ కలిగి ఉంది. మరోవైపు ఎక్స్టీరియర్ విషయానికొస్తే.. హ్యామర్ హెడ్ స్టైలింగ్ తో డిజైన్ చేశారు. 18 ఇంచెస్ రీడిజైన్ అలాయ్ వీల్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, స్లిమ్ LED హెడ్ ల్యాంప్స్ అమర్చారు.

Advertisement

Next Story