Jack&jones నుంచి 'దే డోంట్‌ హోల్డ్‌ బ్యాక్‌ 3.0'

by Harish |   ( Updated:2022-10-08 16:58:15.0  )
Jack&jones నుంచి దే డోంట్‌ హోల్డ్‌ బ్యాక్‌ 3.0
X

దిశ, వెబ్‌డెస్క్: జాక్‌ & జోన్స్, బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రణవీర్ సింగ్‌లు మరోమారు ఫ్యాషన్‌ నియమాలను అధిగమిస్తూ డోంట్‌ హోల్డ్‌ బ్యాక్‌ 3.0 ప్రచారంతో తిరిగి వచ్చారు. ఈ ప్రచారం, నిస్సంకోచమైన ప్రామాణికత, వ్యక్తిత్వపు వేడుకగా ఉంటుంది. డోంట్‌ హోల్డ్‌ బ్యాక్‌ 3.0 ను గతంలో ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి ప్రారంభించారు. తద్వారా తమదైన స్వీయ వ్యక్తిత్వం వెల్లడించేందుకు ఫ్యాషన్‌ ఓ మార్గమని వెల్లడిస్తున్నారు.

ట్రెండీ ఫ్యాషన్‌లకు చిరునామాగా నిలిచే జాక్‌ & జోన్స్ ఈ పండుగ సీజన్‌ లో తమ స్థానాన్ని మరింతగా వృద్ధి చేసుకునే రీతిలో అత్యంత శక్తివంతమైన ప్రచార చిత్రం విడుదల చేసింది. ఈ చిత్రం ప్రతిరోజూ ప్రారంభమవుతుంది. పలువురు కార్పోరేట్స్‌, వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ తమ రోజువారీ పనుల కోసం ప్రమాణాలకనుగుణంగా డ్రెస్సింగ్‌ చేసుకుని వెళ్తారు. అక్కడకు కథానాయకుడు రణవీర్ సింగ్‌, డోంట్‌ హోల్డ్‌ బ్యాక్‌ స్ఫూర్తితో వస్తాడు. తాను నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి ఉండటం తో పాటుగా తన స్వీయ వ్యక్తిత్వం ప్రదర్శిస్తూనే తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ తమకు తాముగా ఉండమని సూచిస్తాడు.

జాక్‌ & జోన్స్ తాజా కలెక్షన్‌ ధరించిన రణవీర్ సింగ్‌, ఓ సాధారణ రోజును అసాధారణంగా తన డ్రెస్సింగ్‌తో మార్చివేశాడు. ఆఫ్‌బీట్‌ సౌండ్‌ ట్రాక్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఒకరిని అనుసరించడం కాకుండా ఉండటాన్ని వేడుక చేస్తూనే ఔట్‌ ఆఫ్‌ ద బాక్స్‌ వైఖరిని ప్రేరేపిస్తుంది. ఈ చిత్రం ద్వారా నిస్సత్తువగా ఉన్న పరిస్థితులను సైతం ఏ విధంగా ఉత్సాహంగా మార్చివేయనున్నది చూపడంతో పాటు ఒకరు సృష్టించిన మార్గంలో పయనించడం కాకుండా తమదైన మార్గం ఎలా వేసుకోవాలో కూడా తెలుపుతుంది.

''ఈ క్యాంపెయిన్‌ తనకు చాలా ప్రత్యేకం. దీని ద్వారా తన వ్యక్తిత్వంలోని పలు కోణాలు చూపేందుకు అవకాశం కలగడంతో పాటుగా ఫ్యాషన్‌ పరంగా ఎంతో ముందున్న స్టైల్స్‌తో ప్రయోగాలు చేసే అవకాశమూ కలిగింది'' అని బ్రాండ్‌ అంబాసిడర్‌ రణవీర్ సింగ్‌ అన్నారు.

ఈ ప్రచారం గురించి బెస్ట్‌ సెల్లర్‌ ఇండియా వద్ద సీఈఓ– కంట్రీ హెడ్‌ శ్రీ వినీత్‌ గౌతమ్‌ మాట్లాడుతూ ''ఈ డోంట్‌ హోల్డ్‌ బ్యాక్‌ 3.0తో తాము తమ కలెక్షన్‌ ద్వారా ముందుకు వెళ్లడానికి భయపడాల్సిన అవసరం లేదని వెల్లడిస్తున్నాము! రణవీర్ సింగ్‌ సాటిలేని ఉత్సాహం, శక్తి, ఆసక్తిని వెల్లడిస్తుంది'' అని అన్నారు.

Watch the video on https://youtu.be/yy7zP8utd9A

11.8 శాతం తగ్గిపొయిన రిటైల్ జాబ్ సెర్చ్‌లు

Advertisement

Next Story

Most Viewed