పనిచేసేందుకు అనువైన కంపెనీల్లో టీసీఎస్ అగ్రస్థానం

by S Gopi |
పనిచేసేందుకు అనువైన కంపెనీల్లో టీసీఎస్ అగ్రస్థానం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఉద్యోగులు పనిచేసేందుకు అనువైన కంపెనీల జాబితాను ప్రముఖ జాబ్‌సైట్ లింక్‌డ్ఇన్ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) అగ్రస్థానంలో నిలించింది. ఈ ర్యాంకులను లింక్‌డ్ఇన్ సంస్థ వ్యాపారం, ఉపాధి ప్రాధాన్యత, కపెనీలో ఉద్యోగుల ప్రమోషన్ రేట్లు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని రూపొందించింది. ఈ ఏడాది ర్యాంకింగ్స్ సాధించిన కంపెనీలు తమ ఉద్యోగుల వృత్తిపరమైన ప్రయాణాన్ని మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నాయని లింక్‌డ్ఇన్ నివేదిక తెలిపింది. ఈ జాబితాలో టీసీఎస్ తర్వాత, యాక్సెంచర్ భారత విభాగం యాక్సెంచర్ ఇండియా రెండో స్థానంలో ఉంది. దేశంలో ఈ కంపెనీ ప్రస్తుతం అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన టెక్నాలజీ, కన్సల్టింగ్ కంపెనీల్లో ఒకటిగా ఉంది. భారత ఐటీ కంపెనీల్లో ఎక్కువ సేవలు, గ్లోబల్ డెలివరీ సామర్థ్యాలను కలిగిన కాగ్నిజెంట్ మూడో ర్యాంకు సాధించింది. అలాగే, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మాక్వారీ గ్రూప్ భారత టాప్ 5 కంపెనీల్లో వరుసగా రెండో ఏడాదిలోనూ చోటు దక్కించుకుంది. ఈసారి ఈ కంపెనీ నాలుగో స్థానంలో ఉండగా, గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ ఐదవ ర్యాంకు దక్కించుకుంది.

Advertisement

Next Story