Jio Phone 5G: అతి తక్కువ ధరకే జియో 5జీ స్మార్ట్‌ఫోన్.. ప్రత్యేకతలు ఇవే?

by Sathputhe Rajesh |   ( Updated:2022-08-16 12:07:57.0  )
Jio Phone 5G to Launch in India soon
X

దిశ, వెబ్‌డెస్క్: Jio Phone 5G to Launch in India soon| టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో.. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. టెక్నాలజీకి అనుగుణంగా కొత్త ఫీచర్లు తీసుకొస్తుంది. టెలికాం రంగంతో పాటు ఫోన్ల తయారీ రంగంలోకి కూడా జియో అడుగుపెట్టింది. గతంలో అతి తక్కువ ధరకు రూ.1500కే బేసిక్ ఫోన్ విడుదల చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత జియో నెక్ట్స్ పేరుతో రూ.5 వేలకు నూతన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఇప్పుడు టెక్నాలజీ అప్డేడ్ అయ్యి త్వరలో ఇండియాలో 5జీ రాబోతుంది. దీంతో 5జీకి సపోర్ట్ చేసే ఫోన్లను విడుదల చేసే ప్రయత్నాల్లో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు నిమగ్నమయ్యాయి.

ఈ క్రమంలో జియో 5జీ స్మార్ట్ ఫోన్ ను త్వరలో మార్కెట్ లోకి విడుదల చేయనుంది. అత్యంత తక్కువ ధరకే అందించనున్న ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. దీని ధర రూ.12 వేలలోపే ఉంటుందని జియో వర్గాలు లీక్ లు ఇచ్చాయి. ఈ ఏడాది దీపావళి సందర్భంగా 5జీ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసే అవకాశముంది.

జియో 5జీ స్మార్ట్ ఫోన్ వివరాలు ఇవే..

-స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్

-2జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్

-6.5 ఇంచుల హెచ్‌డీ+IPS LCD డిస్‌ప్లే

-డ్యూయెల్ కెమెరా, 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా

-8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

ఇది కూడా చదవండి: సరికొత్త మైలురాయిని అందుకున్న boAt సంస్థ

Advertisement

Next Story