కేజీ చికెన్ ధర రూ.700.. మటన్ రేట్స్ చూస్తే నిద్ర కూడా రాదు?

by GSrikanth |   ( Updated:2023-11-06 14:26:01.0  )
కేజీ చికెన్ ధర రూ.700.. మటన్ రేట్స్ చూస్తే నిద్ర కూడా రాదు?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో చికెన్‌ను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ఏ దావత్ జరిగినా తప్పకుండా అక్కడ చికెట్ ఉండాల్సిందే. ముఖ్యంగా బర్త్ డే పార్టీలంటూ, వీకెండ్ పార్టీలంటూ యువత చేసుకునే పార్టీల్లో తప్పకుండా కుండ చికెన్, కబాబ్ చికెన్‌, బగారా చికెన్‌ తప్పకుండా ఉంటుంది. పేద, ధనికుడు అనే తేడా లేకుండా అందరూ తినాలని కోరిక పుట్టినప్పుడల్లా చికెన్ వండుకుంటుంటారు. ఈ చికెట్ రేట్స్ కూడా తరచూ మరుతుంటాయి.

తాజాగా.. చికెన్ ధరలు ఏకంగా ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్లు తెలుస్తోంది. దాయాది దేశమైన పాకిస్తాన్‌లో పౌల్ట్రీ ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. ముఖ్యంగా కోడి మాంసం ఇప్పుడు స్థానిక మార్కెట్‌లో కిలోకు రూ.700 ధర పలుకుతోందని సమాచారం. ఇది భారతదేశంలో మాంసం మరియు గుడ్ల ఉత్పత్తిలో ఐదవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా నిలిచిన కర్ణాటకకు కూడా ఇబ్బందిని కలిగించింది. కర్ణాటకలో బ్రాయిలర్ కోళ్లకు డిమాండ్ పెరగడంతో, ఇతర మాంసాహార రకాలకు కూడా డిమాండ్ పెరిగింది. పౌల్ట్రీ ధరలు బాగా పెరగడానికి పౌల్ట్రీ రైతులకు ముడి పదార్థాల ధరలు పెరగడం కారణమని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌లో మటన్ రేట్స్ డబుల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story