TCS ఉద్యోగులకు బిగ్ షాకింగ్ న్యూస్.. ఇక హైబ్రిడ్ పాలసీకి గుడ్‌బై!

by Harish |   ( Updated:2023-09-29 17:51:03.0  )
TCS ఉద్యోగులకు బిగ్ షాకింగ్ న్యూస్.. ఇక హైబ్రిడ్ పాలసీకి గుడ్‌బై!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. హైబ్రిడ్ వర్క్ పాలసీని ముగించి అక్టోబర్ 1 నుంచి ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఉద్యోగులంతా వారానికి ఐదు రోజులు తప్పనిసరిగా కార్యాలయాలకు రావాలని అంతర్గతంగా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసులకు వస్తుండగా, ఇప్పుడు ఇక వారు అన్ని పనిదినాల్లో ఆఫీసులకు రానున్నారు. కంపెనీ CEO, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ పేరిట ఉద్యోగులు అక్టోబర్ 1 నుంచి వారానికి 5 రోజులు ఆఫీసులకు రావడం తప్పనిసరి అని ఈమెయిల్స్ వచ్చినట్టు సమాచారం.

కరోనా కారణంగా అన్ని కంపెనీలు కూడా వర్క్‌ ఫ్రమ్ హోమ్ పాలసీని తీసుకొచ్చాయి. కరోనా తగ్గిన తర్వాత ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి ఇష్టపడకపోవడంతో కనీసం వారంలో మూడు రోజులు ఆఫీసులకు వచ్చి, మిగతా రోజులు ఇంటి నుంచి పనిచేసేలా హైబ్రిడ్ మోడల్ వర్క్‌‌ను తీసుకొచ్చారు. ఇప్పటికే దాదాపు అన్ని కంపెనీలు కూడా ఉద్యోగులను పూర్తి స్థాయిలో ఆఫీసుల నుంచి పనిచేసేలా ఆదేశాలు ఇచ్చాయి. కొన్ని కంపెనీలు మాత్రం పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఇవ్వగా, మరికొన్ని హైబ్రిడ్ మోడల్‌ను ఇస్తున్నాయి. ఇప్పుడు బడా ఐటీ కంపెనీ TCS పూర్తిగా హైబ్రిడ్ వర్క్ పాలసీని తొలగించడంతో మిగతా కంపెనీలు కూడా ఇదే దారిలో నడిచే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి : Hyderabad లో 64 శాతం పెరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్ గిరాకీ!

Advertisement

Next Story