80సీ పన్ను మినహాయింపు రెట్టింపు చేయాలని కోరుతున్న పన్ను చెల్లింపుదారులు!

by Harish |
80సీ పన్ను మినహాయింపు రెట్టింపు చేయాలని కోరుతున్న పన్ను చెల్లింపుదారులు!
X

న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న వెలువడే కేంద్ర బడ్జెట్‌పై పన్ను చెల్లింపుదారులు అనేక ఆశలతో ఉన్నారు. ప్రముఖ ఆర్థిక ప్రణాళిక స్టార్టప్ కువెరా ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. దీని ప్రకారం, కొత్త బడ్జెట్‌లో చాలా మంది రిటైల్ పెట్టుబడిదారులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని కోరుతున్నారు.

సుమారు 16 లక్షల మంది నుంచి సేకరించిన వివరాల ప్రకారం, ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఇప్పుడున్న రూ. 1.5 లక్షల నుంచి రెట్టింపు చేయాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిమితి 2014 నుంచి మారలేదని, రాబోయే బడ్జెట్‌లో ఈ విషయంపై ఉపశమనం కావాలని స్పష్టం చేసినట్టు కువెరా సహ-వ్యవస్థాపకుడు గౌరవ్ రస్తోగి అన్నారు.

అదేవిధంగా, పెట్టుబడుల్లో ఏదైనా ఒకే తరహా పథకం రెగ్యులర్ నుంచి డైరెక్ట్‌కు మారడాన్ని పన్ను రహితంగా మార్చాలని ప్రతి 10 మందిలో ముగ్గురు కోరుతున్నారు. ప్రస్తుతం దీనిపై 15 శాతం మూలధన రాబడి పన్ను అమలవుతోంది.

Advertisement

Next Story