421 కిలోమీటర్ల రేంజ్‌తో కొత్త టాటా ఈవీ పంచ్ విడుదల

by S Gopi |
421 కిలోమీటర్ల రేంజ్‌తో కొత్త టాటా ఈవీ పంచ్ విడుదల
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈవీ మోడల్ పంచ్‌ను బుధవారం విడుదల చేసింది. రూ. 10.99 లక్షల ప్రారంభ ధరతో తీసుకొచ్చిన ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లతో వచ్చింది. 25 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 315 కిలోమీటర్లు, 35 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 421 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. టాటా పంచ్‌ ఈవీ లాంగ్ రేంజ్ వేరియంట్‌ 9.5 సెకన్లలోపు 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. స్టాండర్డ్‌ రేంజ్‌ వేరియంట్‌ 13.5 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇప్పటికే ఈ కారు కోసం రూ. 21,000తో బుకింగ్స్ ప్రారంభవగా జనవరి 22 నుంచి డెలివరీలు అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది. కారులో 6 ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్, క్రూజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి సేఫ్టీ ఫీచర్లతో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ సదుపాయాలున్నాయి.

Advertisement

Next Story