- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్అండ్డీ సామర్థ్యాన్ని పెంచేందుకు భారీ నియామకాలు చేపట్టనున్న టాటా మోటార్స్!
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తన పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తోంది. దీనికోసం ఆర్అండ్‌డీలో నియామకాలను పెంచడంతో పాటు ప్రస్తుతం ఉద్యోగుల నైపుణ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించింది. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విభాగంతో సహా వివిధ వ్యాపారాల్లో సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సిద్ధమవుతున్నామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈవీ విభాగంలో కంపెనీ బ్యాటరీ ప్యాక్, వాహన నిర్మాణంలో మరింత నైపుణ్యాన్ని సాధించాలని చూస్తోంది. ఆర్అండ్‌డీలో నియామకాలకు సంబంధించి ముఖ్యంగా ఈ ఏడాది భారీగా కొత్త ఉద్యోగులను తీసుకోనున్నాం. అంతేకాకుండా ఆర్అండ్‌డీలో ఇప్పటికే ఉన్నవారి నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాలు, ఈవీ విభాగం అధ్యక్షుడు శైలేష్ చంద్ర అన్నారు. రానున్న కాలంలో కంపెనీ వ్యాపార ప్రణాళికలకు అనుగుణంగా అధునాత ఇంజనీరింగ్, ఉత్పత్తి పెంచడం, సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం, కార్యకలాపాలు, వాణిజ్య విధులు వంటి వివిధ స్థాయిలో నియామకాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా ఈవీ విభాగంలో కమర్షియల్, ప్యాసింజర్, రవాణా వాహనాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించనున్నామన్నారు.