- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tata Motors: 8% క్షీణించిన టాటా మోటార్స్ అమ్మకాలు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఆగస్టు నెలలో తక్కువ అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో జరిగిన విక్రయాలతో పోలిస్తే 8 శాతం క్షీణించి 71,693 యూనిట్లకు పడిపోయాయి. అదే 2023 ఆగస్టులో అమ్మకాలు 78,010 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆదివారం కంపెనీ విడుదల చేసిన డేటా ప్రకారం, మొత్తం దేశీయంగా విక్రయాలు ఆగస్టులో 70,006 యూనిట్లు కాగా, గత ఏడాది ఇదే నెలలో 76,261 యూనిట్ల నుంచి 8 శాతం తగ్గాయి. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు సైతం తగ్గాయి. గత ఏడాది ఇదే కాలంలో 45,933 యూనిట్లను విక్రయించగా, ఇప్పుడు అది 3 శాతం తగ్గి 44,486 కు చేరింది.
అలాగే, వాణిజ్య వాహనాల విక్రయాలు గత సంవత్సరం 32,077 యూనిట్ల నుంచి 15 శాతం క్షీణించి 27,207 యూనిట్లుగా నమోదైయ్యాయి. ట్రక్కులు, బస్సులు వంటి వాహనాల విక్రయాలు 16 శాతం తగ్గి 25,864 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాది ఇదే నెలలో 30,748 యూనిట్లుగా ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ కాలానికి టాటా మోటార్స్ మొత్తం వాణిజ్య అమ్మకాలు 94,410 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6 శాతం పెరిగింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మాత్రం 1 శాతం తగ్గి 1,38,682 యూనిట్లుగా నమోదయ్యాయి. అన్ని విభాగాల అమ్మకాలు మొదటి త్రైమాసికంలో 2,29,891 యూనిట్లు కాగా, ఇది గత ఏడాది 2,26,245 యూనిట్లుగా ఉంది.