- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగపూర్‌లో కొత్తగా బోటిక్‌ను ప్రారంభించిన తనిష్క్
న్యూఢిల్లీ: టాటా గ్రూపు ఆధ్వర్యంలోని ఆభరణాల బ్రాండ్ తనిష్క్ కొత్తగా సింగపూర్‌లో బోటిక్(స్టోర్)ను ప్రారంభించింది. అక్కడి భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులే దీనిని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా తనిష్క్ 50 బోటిక్‌లను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుందని, తమ బ్రాండ్ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని చూస్తున్నట్లు టైటాన్ కంపెనీ సీఈఓ కురువిల్లా మార్కోస్ తెలిపారు. ప్రస్తుతం, టైటాన్ అంతర్జాతీయ మార్కెట్‌లో 13 బోటిక్‌లను కలిగి ఉంది. దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, మలేషియాలో ఇటువంటి రిటైల్ అవుట్‌లెట్‌లను కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సింగపూర్‌లోని తనిష్క్ ప్రపంచం నలుమూలల వచ్చే కస్టమర్లను, సందర్శకులను, స్థానిక ప్రజలను ఆకర్షించనుంది. అభరణాల నాణ్యత, డిజైన్ల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సరికొత్త ఆసక్తికరమైన డిజైన్‌లను అందిస్తామని మార్క్రోస్ అన్నారు.