దక్షిణాసియా బ్రాండ్ ఆస్తులను రిలయన్స్‌కు విక్రయించిన సూపర్‌డ్రై!

by Vinod kumar |
దక్షిణాసియా బ్రాండ్ ఆస్తులను రిలయన్స్‌కు విక్రయించిన సూపర్‌డ్రై!
X

న్యూఢిల్లీ: దేశీయ రిలయన్స్‌లో భాగమైన రిలయన్స్ బ్రాండ్స్ హోల్డింగ్‌ యూకేతో కలిసి ప్రముఖ దుస్తుల బ్రాండ్ సూపర్‌డ్రై జాయింట్ వెంచర్ ఒప్పందంపై సంతకం చేసింది. సూపర్‌డ్రై బ్రాండ్, సంబంధిత ట్రేడ్‌మార్క్‌లతో సహా కంపెనీ మేధో సంపత్తి(ఐపీ) ఆస్తుల విక్రయం కోసం ఈ జేవీ ఏర్పాటు చేసినట్టు బుధవారం ప్రకటించింది. ఈ జేవీలో రిలయన్స్ బ్రాండ్స్‌కు 76 శాతం, సూపర్‌డ్రై 24 శాతం వాటాను కలిగి ఉంటాయి. రిలయన్స్ బ్రాండ్స్ హోల్డింగ్ యూకే రిలయన్స్ సంస్థకు చెందిన రిటైల్ వెంచర్స్ అనుబంధ రిలయన్స్ బ్రాండ్ ఆధ్వర్యంలో ఉంది.

2012 నుంచి దేశీయంగా సూపర్‌డ్రై ఫ్రాంచైజ్ భాగస్వామిగా ఉంది. సూపర్‌డ్రై బ్రాండ్ ఉత్పత్తులను భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో విక్రయిస్తుంది. బ్రాండ్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. జేవీ ఒప్పందంలో భాగంగా సూపర్‌డ్రై తన దక్షిణాసియా ఐపీ విక్రయం విలువ 48.27 మిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 400 కోట్లకు పైగా) నిర్ణయించినట్టు అంచనా. సూపర్‌డ్రై 2012 నుంచి దేశీయ మార్కెట్లో వేగంగా విస్తరించింది. ఆర్థికవ్యవస్థ వృద్ధి, సంపన్నుల సంఖ్య పెరగడంతో బ్రాండ్ వృద్ధి చెందింది.

Advertisement

Next Story

Most Viewed