- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన..!!
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ తెలంగాణలో ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. తరచూ వాతావరణం కూల్‌గా ఉంటూ సాయంత్రం లేదా రాత్రిళ్లు వర్షం పడుతోంది. అయితే తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు ద్రోణి ప్రభావంతో వర్షాలు కురవనున్నాయని అధికారులు రెయిల్ అలర్ట్ జారీ చేశారు. సాయంత్రం ఆదిలాబాద్, మంచిర్యాల,కొమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, ఖమ్మం, జనగాం, సిద్ధిపేట,హనుమకొండ, వికారాబాద్, మెదక్,సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షాలు పడనున్నాయని వెల్లడించింది.
హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.