Stock Market: స్టాక్ మార్కెట్ మళ్లీ ఢమాల్.. ఏకంగా ఎన్ని పాయింట్లు నష్టపోయిందంటే?

by Shiva |
Stock Market: స్టాక్ మార్కెట్ మళ్లీ ఢమాల్.. ఏకంగా ఎన్ని పాయింట్లు నష్టపోయిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: స్టాక్ మార్కెట్లు (Stock Markets) సోమవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 11.04 గంటలకు సెన్సెక్స్ 780 పాయింట్లు నష్టపోయి 75,409 పాయింట్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అదేవిధంగా నిఫ్టీ (Nifty) 244 పాయింట్లు నష్టపోయి 22,845 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కేంద్ర బడ్జెట్‌ (Central Budget) ప్రతిపాదనలు ఆశించిన మేరకు లేకపోవచ్చనే వదంతుల కారణంగా పలు కార్పొరేట్ సంస్థలు (Corporate Bodies) ఆర్ధిక ఫలితాలు తాము ఆశించిన స్థాయిలో రాకపోవడంతో స్టాక్ మార్కెట్ (Stock Market) నష్టాలకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించే ఆమెరికా ఫెడరల్ ఓపెన్ మర్కెట్‌ కమిటీ (FOMC) సమావేశ నిర్ణయాలు కీలకం కానున్న పక్షంలో ఇన్వెస్టర్లు ఆచితూచి ముందడుగు వేస్తున్నారు.

Next Story