NITI Aayog: వికసిత్‌ భారత్‌-2047 సాధించడానికి రాష్ట్రాలు క్రియాశీల పాత్ర పోషిస్తాయి: మోడీ

by Harish |
NITI Aayog: వికసిత్‌ భారత్‌-2047 సాధించడానికి రాష్ట్రాలు క్రియాశీల పాత్ర పోషిస్తాయి: మోడీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని సాధించడం భారతీయులందరి ఆశయమని, దీన్ని సాధించటానికి రాష్ట్రాలు క్రియాశీల పాత్ర పోషిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అన్నారు. ఆయన అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో మోడీ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారని నీతి ఆయోగ్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. ఈ సమావేశం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టి సారిస్తుంది. రాష్ట్రాలు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయి. ప్రజలు అభివృద్ది చెందిన దేశాన్ని చూడటానికి ఆతృతగా ఉన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం అవసరం. అలాగే, భారతీయుల ఆశ నెరవేరడానికి ప్రతి రాష్ట్రం క్రియాశీలక పాత్ర పోషించాలని అన్నారు. ఇంకా సమావేశంలో గ్రామీణ, పట్టణ జనాభా రెండింటికీ జీవన నాణ్యతను మెరుగుపరిచే అంశాలపై కూడా చర్చించారు

Advertisement

Next Story

Most Viewed