- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Decathlon: రూ. 933 కోట్లు పెట్టుబడి పెట్టనున్న స్పోర్ట్స్ రిటైలర్ డెకాథ్లాన్
దిశ, బిజినెస్ బ్యూరో: ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ రిటైలర్ డెకాథ్లాన్ ఇండియాలో తన కార్యకలాపాలను మరింత విస్తరించడానికి మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు బుధవారం తెలిపింది. రాబోయే కాలంలో దేశంలో దాదాపు రూ.933 కోట్లు పెట్టుబడికి కట్టుబడి ఉన్నామని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీ తన విస్తరణలో భాగంగా వచ్చే 5 సంవత్సరాలలో 190 స్టోర్ల నెట్‌వర్క్‌ను కలిగి ఉండాలని యోచిస్తోందని డెకాథ్లాన్ ఇండియా సీఈఓ శంకర్ ఛటర్జీ తెలిపారు. అలాగే, వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో తమ వ్యాపారం రెట్టింపు అవుతుందని ఆయన అంచనా వేశారు.
దీంతో పాటు కంపెనీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి తన డిజిటల్ ఛానెల్‌ని మెరుగుపరచడానికి కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తుంది. డెకాథ్లాన్ సంస్థ ద్వారా అమ్ముడవుతున్న వస్తువులలో 68 శాతం స్థానికంగా ఉత్పత్తి అవుతున్నవే. డెకాథ్లాన్ గ్లోబల్ ఉత్పత్తి శ్రేణిలో 8 శాతం భారతదేశ తయారీ నుంచి వస్తున్నవే ఉన్నాయి. 2026 నాటికి డెకాథ్లాన్ ఇండియా దేశీయ తయారీని 85 శాతానికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఛటర్జీ చెప్పారు. డెకాథ్లాన్ ప్రతి సంవత్సరం 10-15 కొత్త స్టోర్‌లను జోడించాలని యోచిస్తోంది, విస్తరణలో భాగంగా ఆన్‌లైన్ అమ్మకాలను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తుంది.
డెకాథ్లాన్ గ్లోబల్ చీఫ్ రిటైల్, కంట్రీస్ ఆఫీసర్ స్టీవ్ డైక్స్ మాట్లాడుతూ, ఉత్పత్తుల అమ్మకాలలో భారత్ కంపెనీకి ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇక్కడ అనేక అవకాశాలు ఉన్నాయి. మరింత మంది భారత క్రీడాకారులను ప్రోత్సహించడానికి కృషి చేస్తామని చెప్పారు. ఐదేళ్లలో డెకాథ్లాన్‌కు భారత్ దాని మొదటి ఐదు ప్రపంచ మార్కెట్లలో ఒకటిగా ఉంటుందని ఆయన అంచనా వేశారు.