- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
PhonePe, Google Payలకు పోటీగా సపోర్ట్ కావాలంటున్న చిన్న UPI యాప్‌లు
దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ఎక్కువగా యూపీఐ చెల్లింపుల కోసం PhonePe, Google Pay, Paytm వంటి UPI యాప్‌లను ప్రజలు ఎక్కువగా వాడుతున్నారు. దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల పరంగా ఇవి అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే వీటి ఆధిపత్యాన్ని కట్టడి చేయడానికి డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థలో చిన్న UPI యాప్‌లను ప్రోత్సహించాలని సెటిల్‌మెంట్ సిస్టమ్‌లను నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ని ఆయా కంపెనీలు అభ్యర్థించాయి.
NPCI ద్వారా నెలకు 12 బిలియన్ల కంటే ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇది మొత్తం డిజిటల్ చెల్లింపులలో 80 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ముఖ్యంగా ఈ లావాదేవీల్లో PhonePe, Google Pay, Paytm మూడు కంపెనీలు అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే ఇదే సమయంలో చిన్న UPI యాప్‌లను ప్రజలు ఎక్కువగా వినియోగించడం లేదు. పెద్ద కంపెనీలు క్యాష్‌బ్యాక్, రివార్డ్‌లను అందిస్తూ యూజర్లను ఎక్కువగా సంపాదిస్తున్నాయి. కానీ చిన్న యాప్‌లు మార్కెటింగ్ చేయడానికి అవసరమైన బడ్జెట్ తమ వద్ద లేవు కాబట్టి NPCI మాకు సపోర్ట్ అందించాలని కోరుకుంటున్నాయి. UPI చెల్లింపుల్లో PhonePe 47 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా, Google Pay 36.4 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.