- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత ఈక్విటీల్లో అమ్మకాలను కొనసాగిస్తున్న విదేశీ మదుపర్లు!
ముంబై: భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు క్రమంగా నిధులను వెనక్కి తీసుకెళ్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి రూ. 2,313 కోట్ల వరకు నిధులను ఉపసంహరించుకున్నారు. అయితే, ఈ ఏడాది జనవరిలో నెలలో జరిగిన రూ. 28,852 కోట్లతో పోలిస్తే ఈ నెల అమ్మకాలు తగ్గినప్పటికీ ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఇంకా ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో పెరుగుతున్న కీలక వడ్డీ రేట్ల కారణంగా భారత్‌తో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి విదేశీ మదుపర్లు నిధులను వెనక్కి తీసుకెళ్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి కె విజయకుమార్ అన్నారు.
గత నెలలో జరిగిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) అమ్మకాలు గత ఏడు నెలల్లోనే అత్యధికమని ఆయన తెలిపారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, ఈ నెల 1-24వ తేదీల మధ్య ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల నుంచి రూ. 2,313 కోట్లను ఉపసంహరించుకున్నారు. భారత స్టాక్ మార్కెట్లు ప్రీమియం ట్రేడింగ్‌ని కలిగి ఉన్నాయని, ఆ కారణంగానే లాభాల స్వీకరణ అవకాశాన్ని కల్పిస్తున్నాయని విజయకుమార్ పేర్కొన్నారు.