- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చిన్న పెట్టుబడిదారుల రక్షణ కోసం సెబీ కొత్త ప్రతిపాదన
ముంబై: చిన్న పెట్టుబడిదారులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI), రియల్ ఎస్టేట్ ఆధారిత చిన్న పెట్టుబడి హోల్డింగ్‌లను అందించే అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించాలని ప్రతిపాదించింది. రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్ అయినటువంటి మాల్స్, గిడ్డంగులు, భవనాలు మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టడానికి గత మూడు సంవత్సరాలుగా అనేక వెబ్ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వీటిలో కనీస పెట్టుబడి రూ.1,00,000 నుండి రూ. 2,50,000 వరకు ఉంటుంది. వాటిపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం వలన పెట్టుబడిదారులు మోసపోయే అవకాశం ఉంది. కొనుగోలు/అమ్మకం సమయాల్లో ఏకరీతి ప్రామాణికరణ లేకపోవడం వలన వాటిలో పెట్టుబడులు పెట్టిన వారు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, రియల్ ఎస్టేట్ ఆధారిత పెట్టుబడిదారులను రక్షించడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించాలని ప్రతిపాదించినట్లు సెబీ ఓ ప్రకటనలో పేర్కొంది.
Also Read...
డేటా గవర్నెన్స్ క్వాలిటీ ఇండెక్స్‌లో రెండో స్థానంలో షిప్పింగ్ మంత్రిత్వ శాఖ