- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు శుభవార్త చెప్పిన సెబీ
ముంబై: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) శుభవార్త చెప్పింది. మ్యూచువల్ ఫండ్స్ కోసం ఏకరీతి మొత్తం వ్యయ నిష్పత్తిని (TER) ప్రవేశపెట్టాలని సెబీ ప్రతిపాదించింది. TER అనేది పెట్టుబడిదారు కంపెనీలకు చెల్లించాల్సిన గరిష్ట వ్యయ నిష్పత్తిని నిర్ణయిస్తుంది. సాధారణంగా ఇది మ్యూచువల్ ఫండ్ హౌస్ అడ్మినిస్ట్రేటివ్, మేనేజ్‌మెంట్‌తో సహా ఖర్చుల కోసం వసూలు చేసే పథకం కార్పస్ శాతం.
కొత్త పథకంతో పెట్టుబడిదారుల నుంచి నిర్దేశించబడిన TER పరిమితుల కంటే ఎక్కువ మొత్తాన్ని కంపెనీలు వసూలు చేయడం కుదరదు అని సెబీ పేర్కొంది. దీని ద్వారా పెట్డుబడులలో నమ్మకాన్ని పెంచుతుందని ఈ రంగంలో దీర్ఘకాలిక వృద్ధిని ప్రేరేపిస్తుందని రైట్ రీసెర్చ్ ఫౌండర్ అండ్ సీఈఓ సోనమ్ శ్రీవాస్తవ అన్నారు.
ప్రస్తుతం సెబీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్‌హోల్డర్‌లకు పేర్కొన్న TER పరిమితుల కంటే నాలుగు అదనపు రకాల ఖర్చులను వసూలు చేయడానికి కంపెనీలకు అనుమతిస్తుంది. కానీ, కొత్త ప్రతిపాదన ప్రకారం, బ్రోకరేజ్, లావాదేవీ ఖర్చులను, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్, పెట్టుబడి ఖర్చులు, సహా అన్ని ఖర్చులు TER పరిమితిలో ఉంటాయి.
Also Read..
Demonetisation 2.0 :ట్యాక్స్ కలెక్షన్‌పై రూ.2 వేల నోటు ఎఫెక్ట్