- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
F&O లో 90% మంది ఫెయిల్.. అయినా ఎందుకో ఇంట్రెస్ట్: సెబీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: స్టాక్‌మార్కెట్లో ఇటీవల కాలంలో పెట్టుబుడులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా చాలా మంది Futures & Options లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే F&O ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి సెబీ చైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టాక్ మార్కెట్ BSEలో ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ (IRRA) ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) లో 90 శాతం మంది ట్రేడర్లు ఫెయిల్ అవుతున్నారని అన్నారు. ఈ విభాగంలో డబ్బును కోల్పోతున్నప్పటికీ కూడా ఇంకా ఆసక్తితో ఉన్నారని ఇది నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుందని ఆమె తెలిపారు. పెట్టుబడిదారులు దీర్ఘకాలికంగా లాభాలు ఇచ్చే విభాగంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రాబోయే కాలంలో గణనీయమైన రాబడి పొందవచ్చని అన్నారు.
F&O విభాగంలోని 45.24 లక్షల మంది ట్రేడర్లలో కేవలం 11 శాతం మంది మాత్రమే లాభాలను పొందగలుగుతున్నారని గతంలో సెబీ ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా పేర్కొన్నారు. FY19లో ఈ విభాగంలో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య దాదాపు 500 శాతానికి పైగా పెరిగింది. FY22లో F&O లో 89 శాతం మంది నష్టపోగా వారిలో ఒక్కొక్కరు సగటున రూ. 1.1 లక్షలను పొగొట్టుకున్నారు. అలాగే లాభాలు పొందిన వారిలో సగటున ఒక్కొక్కరు రూ.1.5 లక్షల లాభాన్ని ఆర్జించారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో 20-30 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారని ఇటీవల సెబీ నివేదిక పేర్కొంది.
ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ (IRRA) అనే ప్లాట్‌ఫారమ్‌ను సెబీ తీసుకొచ్చింది. బ్రోకింగ్ వ్యవస్థలో ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నట్లయితే ఇన్వెస్టర్లకు నష్టం రాకుండా ఇది ఉపయోగపడుతుంది. ఇన్వెస్టర్స్ ఏదైనా అంతరాయాన్ని ఎదుర్కొన్న సందర్భంలో వారికి ఒక SMS వస్తుంది. దానిలో వచ్చిన లింక్‌ను ఓపెన్ చేసి IRRAని డౌన్‌లోడ్ చేసుకుని రెండు గంటలలోపు ఓపెన్ పొజిషన్‌లను స్క్వేర్-ఆఫ్ చేయవచ్చు.