- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్పామ్ కాల్స్ నియంత్రణకు ట్రాయ్ కొత్త మార్గదర్శకాలు
దిశ, బిజినెస్ బ్యూరో: చాలామంది ప్రమోషనల్స్ లేదా స్పామ్ కాల్స్ కారణంగా చాలాసార్లు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి కాల్స్ నియంత్రణ కోసం టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. రిజిస్టర్ అవ్వని మొబైల్ నంబర్లు, అన్‌వాంటెడ్ కాల్స్‌పై చర్యలు తీసుకోవడంలో భాగంగా ట్రాయ్ మార్గదర్శకాలను రూపొందించింది. సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి ఇలాంటి కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి అలాంటి కాల్స్ ద్వారా ప్రయోజనం పొందే టెలికాం కంపెనీలే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ట్రాయ్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన టెలికాం కంపెనీలకు జరిమానా కూడా ఉంటుంది. అలాగే, టెలికాం కంపెనీలు కాల్స్‌ను గుర్తించేందుకు ఐడెంటిటీని ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం మూడు వేర్వేరు సిరీస్‌లను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మార్కెటింగ్ కాల్స్ కోసం 140, ప్రభుత్వ ఏజెన్సీలకు సంబంధించినవి అయితే 111, సర్వీస్ కాల్స్ కోసం 160 నంబర్లను తీసుకురావొచ్చు. టెలికాం కంపెనీలు కాలర్ పేరుతో పాటు ఏ రంగం అనేది వివరాలు బహిర్గతం చేయాలి. దీనివల్ల వినియోగదారులు అలాంటి కాల్స్‌ను అటెండ్ చేయాలా లేదా నిర్ణయం తీసుకోవచ్చు.