'షాట్‌గన్ 650' బైక్ విడుదల చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

by S Gopi |
షాట్‌గన్ 650 బైక్ విడుదల చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రీమియం బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్లో తన కొత్త షాట్‌గన్ 650 మోడల్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 3.59 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ వెల్లడించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభించామని, మార్చి నుంచి డెలివరీలు, టెస్ట్ రైడ్‌లకు అవకాశం ఉంటుందని కంపెనీ పేర్కొంది. కొత్త మోడల్ షాట్‌గన్ 650 బైక్ నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుందని, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 3.73 లక్షలని తెలిపింది. ఈ బైక్ ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌తో పాటు లైవ్ లొకేషన్, ఇంధన్-ఇంజిన్ ఆయిల్ స్థాయిలు సూచించే టెక్నాలజీ, సర్వీస్ రిమైండర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. అదనంగా యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ఫ్లాట్ హ్యాండిల్ బార్, మిడ్-సెట్ ఫుట్‌పెగ్, సింగిల్ సీట్ సెటర్‌తో వస్తుందని కంపెనీ వివరించింది.

Advertisement

Next Story