- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
2023లో రూఫ్‌టాప్ సోలార్ వృద్ధి 6.25 శాతం
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ సామర్థ్యం గతేడాది 6.25 శాతం వృద్ధితో 1.7 గిగావాట్లు పెరిగిందని ఓ నివేదిక తెలిపింది. అంతకుముందు 2022లో ఇది 1.6 గిగావాట్లుగా నమోదైంది. ప్రముఖ పరిశోధనా సంస్థ మెర్కామ్ కేపిటల్ నివేదిక ప్రకారం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రూఫ్‌టాప్ సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యం 406 మెగావాట్లు పెరిగింది. ఇది అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో ఉత్పత్తి అయిన దానికంటే 15.9 శాతం తగ్గింది. మొత్తంగా గతేడాది డిసెంబర్ నాటికి దేశంలో రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ సామర్థ్యం 10.5 గిగావాట్లకు చేరుకుంది. 2023లో రూఫ్‌టాప్ సోలార్ పెరిగేందుకు రెసిడెన్షియల్ ఇన్‌స్టాలేషన్ ప్రధాన కారణం. ఇళ్లు, ఇతర గృహ సముదాయాల్లో రూఫ్‌టాప్ సోలార్ గణనీయంగా పెరుగుతోంది. విద్యుత్ బిల్లులు పెరగడం, సోలార్ ఇన్‌స్టాలేషన్ తగ్గడమే దీనికి ముఖ్యమైన కారణాలు. వాణిజ్య, పరిశ్రమల అవసరాల్లో దీని వృద్ధి మరీ ఎక్కువ లేదు. ఛార్జీలు మరింత తగ్గుతాయనే ఆలోచనతో కమర్షియల్ వర్గాలు వేచి చూస్తున్నాయి. రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌లో అధికంగా 27.3 శాతం వాటాతో గుజరాత్ మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర(13.3 శాతం), రాజస్థాన్(8.1 శాతం)తో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.