- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Reliance: 2024 వీజీకీ మీడియా విజిబిలిటీ ర్యాంకింగ్స్ విడుదల.. రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ ప్లేస్..!
దిశ,వెబ్‌డెస్క్: భారతదేశ దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) గురించి మన దేశంలో తెలియని వారుండరు. కంపెనీ ఆదాయం(Income), మార్కెట్ వాల్యూ(Market Value), ప్రాఫిట్స్(Profits) పరంగా దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థ. ఈ సంస్థకు చమురు శుద్ధి(Oil Refining) నుంచి మొదలుకొని టెలికాం(Telicom) వరకు వ్యాపారాలున్నాయి. అందుకే రిలయన్స్ పేరు నిత్యం వార్తల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే 2024 ఏడాదికి గానూ వీజీకీ(Wizikey) వెల్లడించిన మీడియా విజిబిలిటీ(Media Visibility) ర్యాంకింగ్స్‌లో రిలయన్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఎఫ్ఎంసీజీ(FMCG), బ్యాంకింగ్(Banking), ఫైనాన్సియల్(Financial) కంపెనీల కంటే రిలయన్స్ ఎక్కువగా వార్తల్లో నిలిచిందని తెలిపింది.
వీజీకీ నివేదికలో ఈ సంస్థ 100 పాయింట్ల స్కోర్ కు 97.43 స్కోర్ సాధించింది. సుమారు నాలుగు లక్షలకు పైగా కంపెనీలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా ఈ స్కోరింగ్ లెక్కించారు. ఇక రిలయన్స్ తర్వాత 89.13 పాయింట్లతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 86.24 స్కోర్ తో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మరోవైపు పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, జొమాటో, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టీసీఎస్, ఐటీసీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.